: లాభించిన నోట్ల రద్దు... కాంగ్రెస్, ఎన్సీపీ కంచుకోటల్లోకి చొచ్చుకెళ్లిన బీజేపీ


పెద్ద నోట్ల రద్దు అంశం ప్రధాన ప్రచారాస్త్రంగా సాగిన మహారాష్ట్ర పురపాలక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలకు కంచుకోటగా ఉన్న ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లింది. తొలి దశలో భాగంగా 147 పురపాలక సంఘాలు, 17 నగర పంచాయతీల్లోని 3705 వార్డులకు ఎన్నికలు జరుగగా, 3,010 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. వీటిల్లో బీజేపీ 851 స్థానాలు గెలిచి, మిగతా పార్టీలతో పోలిస్తే ముందు నిలిచింది. 147 పురపాలక సంఘాల అధ్యక్ష స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు సాగగా, 52 పురపాలికలు బీజేపీ వశమయ్యాయి. శివసేన 514, ఎన్సీపీ 638, కాంగ్రెస్ 643, ఎంఎన్ఎస్ 16, బీఎస్పీ 9, సీపీఎం 12, స్వతంత్రులు 324 స్థానాల్లో విజయం సాధించారు. ఈ గెలుపుపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీపై విశ్వాసం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలని సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News