: ఏలూరులో వ్యక్తి దారుణహత్య.. రాళ్లతో కొట్టి చంపిన దుండగులు
ఏలూరు జూట్‌మిల్ సమీపంలో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని రాళ్లతో దారుణంగా కొట్టి చంపారు. మృతుడు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగేంద్ర కాలనీకి చెందిన రాజాగా పోలీసులు గుర్తించారు. మృతుడు పెయింటర్‌గా పనిచేస్తుంటాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్టు తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.