: తమన్నా సీక్రెట్ రివీల్ అయిపోయింది!
తన తదుపరి సినిమాను గురించి ఇంతవరకూ ఎక్కడా మాట్లాడలేదనీ, ఆ విషయం చెబితే అంతా సర్ ప్రైజ్ కావడం ఖాయమంటూ సస్పెన్స్ లో పెట్టిన తమన్నా సీక్రెట్ రివీల్ అయిపోయింది. 12.3 కోట్ల రూపాయలతో రూపొంది, బాలీవుడ్ లో 2014 లో సూపర్ హిట్ గా నిలిచి, హీరోయిన్ కంగనా రనౌత్ కు స్టార్ హోదా ఇస్తూ, 108 కోట్ల వసూళ్లు సాధించిన 'క్వీన్' సినిమా రీమేక్ వెర్షన్ లో తమన్నా నటించనుంది. కోలీవుడ్ లో రూపొందనున్న ఈ సినిమాలో మరో ప్రత్యేకత ఏంటంటే... ప్రముఖ నటి రేవతి దీనికి దర్శకత్వం వహించనుండగా, దీనికి సంభాషణలు సుహాసిని మణిరత్నం రాస్తోంది. దీంతో తమన్నా, రేవతి, సుహాసని కాంబినేషన్ అనగానే ఈ సినిమాపై ఎక్కడలేని ఆసక్తి కలుగుతోంది. క్రేజీ కాంబినేషన్ అంటూ ఫిల్మ్ నగర్ లో దీని గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఇంకా పూర్తిస్థాయిలో ప్రకటించకుండానే ఈ సినిమా ఆసక్తిని రేకెత్తించడం విశేషం.