: విశాల్ గొప్ప మనసు... మరో ఆర్థిక సాయం
ప్రముఖ నటుడు విశాల్ తనది గొప్పమనసని మరోసారి నిరూపించుకున్నాడు. కష్టంలో ఉన్నారని తనకు తెలిస్తే సాయం చేయడంలో విశాల్ ముందుంటాడు. రజనీకాంత్, విజయ్ కాంత్, సత్యరాజ్ వంటి పెద్ద హీరోల సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేసిన చంద్రబోస్ భార్యకు నగదు సాయం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న దివంగత చంద్రబోస్ భార్య రాజకుమారి వద్ద కనీసం మందులు కొనేందుకు కూడా డబ్బులు లేవని తెలియడంతో చలించిపోయిన నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ ఆమెకు ఆర్థిక సాయం అందించారు. గతంలో ఆయన పలు సందర్భాల్లో ఆపన్నులకు ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే.