: పిల్లలకు ప్రతినెలా పుట్టినరోజు జరపాలి: ట్రంప్ తనయ


వివాదాస్పద వ్యాఖ్యలతో అమెరికా అధ్యక్షపదవిని దక్కించుకున్న డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ చిత్రమైన ప్రకటన ఒకటి చేసింది. నవంబర్ చివరి ఆదివారంతో క్యాథలిక్కులు ఆగమనకాలంలోకి ప్రవేశిస్తారు. దీంతో అంతకుముందు రోజును థ్యాంక్స్ గివింగ్ డే (ఏడాదంతా తమను కాపాడిన దేవుడికి కృతజ్ఞతార్పరణల రోజు) గా నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా కుటుంబం మొత్తం ఒకచోట చేరి రోజంతా గడిపి, నచ్చిన వంటకాలతో డిన్నర్ చేసి ఆనందిస్తారు. ఈ సందర్భంగా ఆ ఏడాదంతా చేసిన తప్పులను ప్రార్థనలో దేవుడికి ఏకరువు పెడతారు. దీంతో ఆ తప్పులను కుటుంబ సభ్యులు క్షమిస్తారు. ఈ సెలబ్రేషన్ అనంతరం ట్వీట్ చేసిన ఇవాంకా..'ఇవ్వాల్టికి వీడు (థియోడర్) పుట్టి సరిగ్గా ఎనిమిది నెలలు. పుట్టినరోజు శుభాకాంక్షలు కన్నా'! అని ట్వీట్ చేసింది. దీనికి అమెరికన్లు స్పందించారు. 'ఎనిమిది నెలలకు పుట్టిన రోజేంటి? మరో నాలుగు నెలలు ఆగితే వస్తుందిగా?' అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఇవాంకా ట్రంప్...'అసలు పిల్లల పుట్టిన రోజులు తొలిఏడాది వచ్చేవరకు ప్రతి నెలా జరపాలి' అని చిత్రమైన వివరణ ఇచ్చింది. దీంతో అయితే 'నీ కొడుకు మరోనాలుగు నెలల్లో రెండో పుట్టినరోజు జరుపుకుంటాడ'న్నమాట అని నెటిజన్లు పేర్కొన్నారు. 'అవునా? నా కొడుకుని విష్ చెయ్యడం మర్చిపోయాన'ని ఓ నెటిజన్ ఎద్దేవా చేస్తే, 'పుట్టినరోజును అలా లెక్కించరు ఇవాంకా' అంటూ మరో నెటిజన్ హితవు పలికాడు. దీంతో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

  • Loading...

More Telugu News