: ‘కాంగ్రెస్’ కండువా కప్పుకున్న సిద్ధూ భార్య
పంజాబ్ బీజేపీ ఎమ్మెల్యే, క్రికెటర్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌరు సిద్ధూ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే పర్గత్ సింగ్ తో కలిసి ఈరోజు ఆ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రణ్ దీప్ సర్జేవాలా సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమంలో వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నవజ్యోత్ కౌర్ సిద్ధూ మాట్లాడుతూ, పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ అమృత్ సర్ స్థానం నుంచి తాను బరిలోకి దిగుతానని ఆమె పేర్కొన్నారు.