: కేసీఆర్ కొత్త బంగళాపై కోదండరామ్ తీవ్ర విమర్శలు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే కొత్త బంగళాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ తీవ్ర విమర్శలు చేశారు. ఉన్న బంగళా సరిపోకపోతే మరో బ్లాక్ నిర్మించుకుంటే సరిపోయేదని... ఒక్క ఏడాది సమయంలోనే కొత్తగా ఇంత పెద్ద బంగళా కట్టుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. పేదల కోసం కట్టిస్తామన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సంగతి ఏమైందని నిలదీశారు. ఈ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ నెల 30న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భూ నిర్వాసితుల సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సదస్సుకు పాలమూరు-రంగారెడ్డి, ఓపెన్ కాస్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్వాసితులందరినీ పిలుస్తున్నామని తెలిపారు. నిర్వాసితుల గురించి మాట్లాడిన వారందరినీ... రాష్ట్ర అభివృద్ధి నిరోధకులుగా లెక్కగట్టే పద్ధతిని ప్రభుత్వం మానుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News