: మోదీని దేశ రాజకీయాల్లో లేకుండా చేస్తా!: ప్రతినబూనిన మమతాబెనర్జీ
పెద్దనోట్ల రద్దుపై మొదటి నుంచి విమర్శలు కురిపిస్తున్న పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మరోమారు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను బతికినా, చనిపోయినా ఫర్వాలేదు కానీ, ప్రధాని మోదీని దేశ రాజకీయాల్లో లేకుండా చేస్తానని ప్రతిన బూనారు. కాగా, పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ ప్రతిపక్షాలు ఈ రోజు భారత్ బంద్ నకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం లేకపోవడం, ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడంపై కూడా ఆమె మాట్లాడారు.