: రవీంద్ర జడేజా అద్భుత బ్యాటింగ్... ఇంగ్లండ్ పై ఆధిక్యంలోకి భారత్
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత బ్యాటింగ్ ప్రతిభతో మొహాలీలో ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడవ టెస్టులో భారత జట్టు ఇంగ్లండ్ చేసిన 283 పరుగులను దాటి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఓవర్ నైట్ స్కోరు 271/6 పరుగులతో నేడు ఆటను ప్రారంభించిన భారత జట్టు ఆటగాళ్లు జడేజా, అశ్విన్ లు ఆచితూచి ఆడుతూ ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టోక్స్ బౌలింగ్ లో బట్లర్ క్యాచ్ పట్టగా అశ్విన్ అవుటైనప్పటికీ, భారత స్కోరులో జోరు తగ్గలేదు. జడేజాతో జతకట్టిన జయంత్ యాదవ్ సైతం ధాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత స్కోరు 113 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 354 పరుగులు కాగా, జడేజా 70, యాదవ్ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ పై భారత లీడ్ 71 పరుగులు.