: మరో ఘనతను సాధించిన ఎయిర్ టెల్!


భారత టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న ఎయిర్ టెల్ మరో ఘనతను సాధించింది. ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకును ఇటీవలే ఈ సంస్థ స్థాపించింది. ఈ పేమెంట్ బ్యాంకుకు వినియోగదారులు బ్రహ్మరథం పడుతున్నారు. రికార్డు స్థాయి ఖాతాలతో పేమెంట్ బ్యాంక్ దూసుకుపోతోంది. పైలట్ ప్రాజెక్టుతో కేవలం రెండు రోజుల్లోనే 10 వేల ఖాతాలకు పైగా నమోదు చేసింది. ఖాతా డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీతో ప్రయోగాత్మకంగా చెల్లింపుల ఖాతాను ఎయిర్ టెల్ ప్రారంభించింది. ఈ ఖాతాలపై అధిక వడ్డీని చెల్లించడంతో పాటు, లక్ష రూపాయల బీమాను కూడా ఎయిర్ టెల్ అందిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలను కూడా అందించనున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో శశి అరోరా తెలిపారు. ఈ బ్యాంకులో ఖాతాదారుల గరిష్ట పరిమితిని లక్ష రూపాయలుగా ఎయిర్ టెల్ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News