: తక్షణం రండి... అందుబాటులోని కేంద్ర మంత్రులకు మోదీ పిలుపు


ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా, ఏ విధమైన చర్చలూ జరగకపోవడం, నేటి భారత్ బంద్ లతో పాటు, బ్యాంకులకు చేరని కరెన్సీ, ప్రజల్లో పెరుగుతున్న అసహనం తదితరాలను చర్చించేందుకు మోదీ మంత్రులను పిలిచినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి వున్నాయి. ఈ లోగా ఎలాంటి సమావేశాలు ఎన్డీయే షెడ్యూల్ లో లేవు. కానీ, తక్షణం పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయానికి మంత్రులంతా రావాలన్న సమాచారం వెలువడటంతో, అందరూ ఆగమేఘాల మీద ప్రధాని వద్దకు చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో మోదీ ఏం మాట్లాడతారన్నది మరికాసేపట్లో తెలుస్తుంది.

  • Loading...

More Telugu News