: హంద్వారాలో దాగున్న ఉగ్రవాదులు... భద్రతాదళాల భీకర పోరు


జమ్మూకాశ్మీర్ లోని హంద్వారా పరిధిలో ఉన్న లాన్ గేట్ ప్రాంతం ఈ ఉదయం నుంచి కాల్పులతో దద్దరిల్లుతోంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతాదళాలు సోదాలు జరుపుతుంటే, ఓ భవంతిలో దాగున్న ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు సమీప ప్రాంతాల ప్రజలను తరలించి, ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఎన్ కౌంటర్ ప్రారంభించారు. కనీసం ఇద్దరు ఉగ్రవాదులు దాగున్నట్టు తెలుస్తుండగా, వారి వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులు, భారత జవాన్ల మధ్య ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఎన్ కౌంటర్ పై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News