: నేను తీయబోయే అంతర్జాతీయ స్థాయి సినిమాకు అన్నీ ఉన్నాయి, కావాల్సింది ఆ ఒక్కడే!: తనికెళ్ల భరణి
'వచ్చే ఏడాది నేను తీయబోయే అంతర్జాతీయ స్థాయి సినిమాకు అన్నీ రెడీగా ఉన్నాయి కానీ, కావాల్సిందల్లా ఆ ఒక్కడే.. ప్రొడ్యూసర్. ఎవరైనా ఉంటే రండి’ అని ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి పిలుపు నిచ్చారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానం ఇచ్చారు. 'ఈ ఏడాది చాలా సినిమాల్లో నటిస్తున్నాను. వచ్చే ఏడాది, అంతర్జాతీయ స్థాయిలో ఉండే ఒక సినిమా తీయాలని అనుకుంటున్నాను. తెలుగు జాతి గర్వించి, ప్రపంచం అంతా తల ఎత్తుకుని చేసేలా ఆ సినిమా ఉండేలా తీయాలని అనుకుంటున్నాను. ఈ సినిమాకు కథ, డైలాగ్స్, స్క్రిప్ట్, డైరెక్టర్ అందరూ ఉన్నారు. కావాల్సిందల్లా ఒక్కడే.. ప్రొడ్యూసర్. ఎవరన్నా ఉంటే రండి’ అని భరణి అన్నారు.