: నిరసన వ్యక్తం చేస్తున్నామే తప్ప, భారత్ బంద్ లేదంటున్న జైరాం రమేశ్
పెద్దనోట్ల రద్దుపై నిరసన తెలుపుతూ రేపు భారత్ బంద్ అంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ స్పందించారు. పెద్దనోట్ల రద్దుపై తాము నిరసన వ్యక్తం చేస్తున్నామే తప్పా, భారత్ బంద్ కు పిలుపు నివ్వలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు ఈ బంద్ ను తలపెట్టాయంటూ అధికార పార్టీ బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు కారణంగా నల్లధనవంతులకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదని, అవస్థలు పడుతున్నదల్లా సాధారణ ప్రజలేనని జైరాం అన్నారు. ఈ నోట్ల రద్దును తాము ప్రశ్నిస్తుంటే.. అవినీతికి తాము వ్యతిరేకంగా పోరాడుతున్నామంటూ రాజకీయ ఎత్తుగడను కేంద్రం ప్రదర్శిస్తోంది అని జైరాం రమేశ్ విమర్శించారు.