: ముద్రగడపై ప్రశంసలు కురిపించిన మోహన్ బాబు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఒక యోధుడిలా పోరాటం చేస్తున్నారని ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు ప్రశంసలు కురిపించారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి ఈరోజు వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాపుల రిజర్వేషన్ల కోసం ఆయన చేస్తున్న పోరాటం విజయం సాధించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. కాగా, కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమిస్తున్నారు. ఇటీవల ఆయన నిర్వహించాలని అనుకున్న పాదయాత్ర జరగలేదు. కిర్లంపూడిలోని తన నివాసం నుంచి ముద్రగడ బయటకు రాగానే పోలీసులు అడ్డుకోవడం విదితమే.