: కొత్త పాక్ సైన్యాధ్యక్షుడితో జాగ్రత్త: మాజీ ఆర్మీ చీఫ్ విక్రమ్ సింగ్


పాకిస్థాన్ కొత్త సైన్యాధ్యక్షుడిగా నియమితమైన లెఫ్టినెంట్ జనరల్ కమర్ జావేద్ బజ్వాతో జాగ్రత్తగా ఉండాలని భారత మాజీ సైన్యాధ్యక్షుడు విక్రమ్ సింగ్ వ్యాఖ్యానించారు. బజ్వాను నిష్ణాతుడైన కఠినుడిగా అభివర్ణించిన విక్రమ్ సింగ్, ఐక్యరాజ్యసమితి అసైన్ మెంట్ లో భాగంగా, ఆయనతో కలసి కాంగోలో పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. అప్పుడు ప్రపంచ శాంతి కోసం తాము పనిచేశామని, సొంత దేశానికి వచ్చిన తరువాత తమ లక్ష్యాలు వేరని చెప్పుకొచ్చారు. స్వదేశంలో జాతి ప్రయోజనాలే ముఖ్యమని, బజ్వా సైతం అదే దారిలో నడుస్తారని భావిస్తున్నానని చెప్పారు. ఆయన చర్యలను భారత్ జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించాల్సి వుందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News