: అసలైన మెగా వారసుడిని దగ్గరగా చూశాను: యాంకర్ అనసూయ


అసలైన మెగాస్టార్ వారసుడు ఎలా ఉండాలో తాను దగ్గర్నుంచి చూశానని చెబుతోంది యాంకర్, నటి అనసూయ. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'విన్నర్' చిత్రంలో స్పెషల్ సాంగ్ అవకాశాన్ని అనసూయ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ పాట షూటింగ్ పూర్తికాగా, సాయిధరమ్ తేజ్ ను పొగడ్తలతో ముంచెత్తుతోందీ ముద్దుగుమ్మ. ఈ సినిమా కోసం 10 రోజుల పాటు పనిచేశానని, సాయిలోని నాట్య కౌశలం అద్భుతమని, డ్యాన్స్ లో అతని స్పీడ్ ను తాను అందుకోలేకపోయానని చెప్పుకొచ్చింది. ఈ పది రోజుల్లో మెగాస్టార్ చిరంజీవికి వారసుడంటే ఎలా ఉండాలో తనకు తెలిసిందని అంటోంది.

  • Loading...

More Telugu News