: 5కె రన్‌ను ప్రారంభించిన నటి రాశీఖన్నా.. పాల్గొన్న సినీ ప్రముఖులు
హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో కొద్దిసేపటి క్రితం ఫ్రీడం హైదరాబాద్ 5కె రన్ ప్రారంభమైంది. సినీ నటి రాశీఖన్నా 5కె రన్‌ను ప్రారంభించారు. పలువురు సినీ, బుల్లితెర నటులతో పాటు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి అడుగు.. ఆరోగ్యానికి మెట్టు అనే నినాదంతో ప్రారంభమైన 5కె రన్‌లో పాల్గొనేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉదయం 6:15 గంటలకు 10కె రన్ ప్రారంభం కాగా, 7 గంటలకు 5కె రన్ ప్రారంభమైంది.