: 28న హైదరాబాదులో ఆటోలు బంద్


పెద్ద నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 28న విపక్షాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ ల జేఏసీ మద్దతు తెలిపింది. దీంతో ఈ నెల 28న హైదరాబాదు, సికిందరాబాద్ జంటనగరాల్లో ఆటోల బంద్‌ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నల్లధనంతో ఎటువంటి సంబంధం లేని సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఇబ్బందులు కేంద్రానికి తెలిసేలా చేసేందుకు తాము భారత్ బంద్ కు మద్దతు పలికినట్టు ఆటో డ్రైవర్స్ యూనియన్ తెలిపింది.

  • Loading...

More Telugu News