: ‘పోరాట‌యోధుడికి సెల్యూట్’.. ఫెడల్ క్యాస్ట్రో మృతికి సంతాపం తెలిపిన పవన్ కల్యాణ్


కమ్యూనిస్ట్ యోధుడు, క్యూబా మాజీ అధినేత ఫెడల్ క్యాస్ట్రో మృతికి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. గొప్ప నేత‌ ఫెడల్‌ క్యాస్ట్రో ఈ రోజు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లార‌ని, ప్రజల్లో స్పూర్తిని నింపిన ఆయ‌న‌కు త‌మ పార్టీ సెల్యూట్ చేస్తోందని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్వ‌హించిన‌ ప‌లు స‌భ‌లలో పోరాట‌యోధుడు చెగువేరా పేరును ఎన్నోసార్లు త‌లుచుకున్న విష‌యం తెలిసిందే. తాము అమితంగా అభిమానించే చెగువేరాతో క‌లిసి క్యాస్ట్రో చేసిన‌ పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్నామని, క్యూబన్ల ప్రజారోగ్యం కోసం ఆయన అమితంగా కృషి చేశార‌ని పవన్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. క్యాస్ట్రో ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న‌ట్లు ప‌వ‌న్ చెప్పారు.

  • Loading...

More Telugu News