: పెద్దనోట్ల రద్దు మంచిపని.. మోదీ మరిన్ని చర్యలు తీసుకోవాలి: సూచనలు చేసిన బీహార్ సీఎం
నల్లధనాన్ని అరికట్టడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నారో.. ఆయన పోరాటానికి మద్దతు పలకడంలో బీహార్ సీఎం నితీశ్‌కుమార్ కూడా అంతే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ పెద్దనోట్ల రద్దు అంశాన్ని అడ్డుపెట్టుకొని మోదీ నిర్ణయంపై విమర్శల జల్లు కురిపిస్తోంటే, నల్లధనాన్ని అరికట్టడానికి ఇటువంటి చర్యలు తీసుకోవాల్సిందేనని నీతీశ్ ఉద్ఘాటిస్తున్నారు. ఈ రోజు ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... దేశంలో బినామీ ఆస్తులపై దాడులకు ఇదే సరైన సమయమని అన్నారు. దేశ వ్యాప్తంగా మద్యపానంపై నిషేధం విధించాలని అన్నారు. బినామీ ఆస్తులు, మద్యపాన అమ్మకాల వల్లే దేశంలో నల్లధనం కూరుకుపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు.