: ‘ఆయనొక విప్లవ చిహ్నం’.. ఫిడెల్ క్యాస్ట్రో మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖుల సంతాపం
కమ్యూనిస్టు యోధుడు, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పించారు. బాలీవుడ్ దర్శకులు హన్సల్ మెహతా, అశ్విన్ ముశ్రన్, నిఖిల్ అద్వాని, వివేక్ అగ్నిహోత్రి, మధుర్ భండార్కర్ తో పాటు పలువురు ప్రముఖులు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ మహానేత మృతి పట్ల సంతాపం తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఫిడెల్ క్యాస్ట్రో ఒక విప్లవ చిహ్నమని, ప్రపంచంలోని ఉత్తమ నేతలలో ఆయన ఒకరని పేర్కొన్నారు. అగ్రరాజ్యం అమెరికా ఆయనను హతమార్చాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయని, చివరకు ఆయన అనారోగ్యంతో మరణించి సుదీర్ఘ నైతిక ఉద్యమాన్ని నిరూపించారని ట్విట్టర్లో ఆయనను కొనియాడారు. ఆయన ఓ గొప్ప విప్లవాత్మక నాయకుడు అని కొనియాడారు.