: రద్దైన రూ.500 నోటుతో రీఛార్జ్ చేయించుకున్న వారి వివరాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం


రద్దైన రూ.500 నోటుతో రిటైలర్ల వద్ద మొబైల్‌ రీఛార్జ్‌ చేయించుకున్న వారి నెంబర్లను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోంది. రద్దైన రూ.500 నోటుతో రూ.500 వరకు ప్రీ-పెయిడ్‌ మొబైల్‌ రీఛార్జ్‌ చేయించుకోవచ్చని కేంద్రం ప్రభుత్వం కొన్ని రోజుల ముందు ప్రకటించింది. తాజాగా ఈ నోట్ల‌తో ఫ్రీ-పెయిడ్‌ టాపప్స్‌ పొందే అవకాశాన్ని డిసెంబరు 15 వరకు కల్పిస్తూ ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్పుడు వారి నంబ‌ర్ల‌ను తీసుకునే ప‌నిలో కేంద్ర ప్ర‌భుత్వం ఉంది. ఈ మేర‌కు స‌ర్కారు నుంచి వ‌చ్చిన ఆదేశాల మేర‌కు టెలికాం సర్వీసు ప్రొవైడర్లు రిటైర‌ర్ల వ‌ద్ద ఆ క‌స్ట‌మ‌ర్ల నెంబ‌ర్లను తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News