: రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుడి వద్ద రూ.50 లక్షల డబ్బు... స్వాధీనం చేసుకున్న పోలీసులు
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులకి లక్షల కొద్దీ డబ్బు పట్టుబడుతోంది. ప్రధాని మోదీ తీసుకున్న సంచలన నిర్ణయంతో భయంతో వణికిపోతోన్న నల్లకుబేరులు తమ నోట్లకట్టలను మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ పట్టుబడుతున్నారు. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో రైల్వే, కస్టమ్స్ అధికారులు రూ.50 లక్షలను తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డబ్బుని స్వాధీనం చేసుకున్న పోలీసులు మీడియాతో మాట్లాడుతూ... సదరు వ్యక్తి చైన్నై నుంచి బొకారో ఎక్స్‌ప్రెస్‌లో రాజమహేంద్రవరం వచ్చాడని చెప్పారు.