: కొత్త నోట్లు కట్నంగా ఇస్తేనే పెళ్లి... మొండికేసిన పెళ్లికొడుకు


నోట్ల రద్దు వ్యవహారం అనేక కుటుంబాల్లో అలజడి రేపుతోంది. కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో కూడా అర్థం కాక... తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నారు సామాన్యులు. తాజాగా నోట్ల రద్దు అంశం ఓ పెళ్లిని అర్థాంతరంగా ఆపేసే పరిస్థితి తలెత్తింది. వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో తెల్లారితే ఓ పెళ్లి జరగాలి. అయితే, కట్నంగా కొత్త నోట్లు, కారు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని... లేకపోతే చేసుకోనంటూ పెళ్లికొడుకు భీష్మించుక్కూర్చున్నాడు. పెళ్లికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బంధువులంతా తరలి వచ్చారు. తెల్లారితే పెళ్లి అంతే. కానీ ఇక్కడ సీన్ అడ్డంగా తిరగడంతో వధువు కుటుంబీకులు షాక్ కు గురయ్యారు. కట్నంగా కొత్త నోట్లు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని వరుడు ముందే షరతు పెట్టాడని... అయితే, సమయానికి వాటిని తాము సమకూర్చలేకపోయామని వధువు తండ్రి వాపోయాడు. ఇప్పటికిప్పుడు కొత్త నోట్లను ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆవేదన వ్యక్తం చేశాడు. దిక్కుతోచని స్థితిలో వధువు కుటుంబం డీలాపడిపోయింది.

  • Loading...

More Telugu News