: ఇరాక్ లో ఘోర రైలు ప్రమాదం
ఇరాక్ లోని సెమ్నాన్ ప్రావిన్స్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్యాసింజర్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పగా... రెండు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు, పోలీసులు క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద వివరాల్లోకి వెళ్తే, నిలిచి ఉన్న ప్యాసింజర్ ను మరో ట్రాక్ పై వస్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి ఢీకొట్టింది. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.