: టిప్ గా కొత్తనోట్లు.. రూ.18 వేలు ఇచ్చిన బాలీవుడ్ హీరో
ముంబయిలోని ఒక స్టార్ హోటల్ లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇచ్చిన కొత్తనోట్ల ‘టిప్’ను చూసి సిబ్బంది సంతోషపడ్డారు. టిప్ గా ఇచ్చింది వెయ్యో, రెండో వేలో కాదు... రూ.18 వేలు! గత ఆదివారం ముంబయి శివారులోని ఒక రెస్టారెంట్ కు తన కుటుంబసభ్యులతో కలిసి అక్షయ్ కుమార్ వెళ్లాడు. అక్కడ డిన్నర్ చేసిన అనంతరం బిల్లు మొత్తం నగదు రూపంలోనే అక్షయ్ చెల్లించాడు. అక్కడి నుంచి వెళ్లే సమయంలో పద్దెనిమిది వేల రూపాయల కొత్తనోట్లను టిప్ గా టేబుల్ పై ఉంచి వెళ్లారు. పెద్దనోట్ల రద్దుతో సతమతమవుతున్న తరుణంలో కొత్తనోట్ల టిప్ రావడం, అదీ పెద్దమొత్తంలో దక్కడంపై సిబ్బంది తెగ ఆనందిస్తున్నారు.