: కాసేపట్లో హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్న మోదీ.. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం కేసీఆర్
చంఢీగఢ్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో నగరంలో అడుగుపెట్టనున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శంషాబాద్ ఎయిరుపోర్టుకి చేరుకున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర నేతలు కూడా అక్కడకు చేరుకుంటున్నారు. సర్దార్ వల్ల భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశాన్ని కేంద్ర హోం శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మోదీ జాతీయ పోలీస్ అకాడమీకి వెళ్లనున్నారు. రేపు డీజీపీలతో ప్రధానమంత్రి మోదీ చర్చిస్తారు. రేపు ఉదయం మోదీ డీజీపీలతో కలిసి యోగా కార్యక్రమంలోనూ పాల్గొంటారు. డీజీపీల సమావేశంలో ముఖ్యంగా ఉగ్రవాదుల ముప్పు, నకిలీ నోట్ల నిర్మూలన, అంతర్గత భద్రత అంశాలను చర్చించనున్నట్లు తెలుస్తోంది. దక్షిణ భారత్‌లో డీజీపీల సమావేశం జరగడం ఇదే మొదటి సారి.