: బ్యాంకు క్యూ లైన్ లో మరొకరు గుండెపోటుతో మృతి


బ్యాంకులలో లేదా ఏటీఎంలలో డబ్బు డ్రా చేసుకునేందుకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా, కర్నూల్ జిల్లా నందికొట్కూరులో ఒక రిటైర్డ్ పశువైద్యుడు బాలరాజు ప్రాణాలు విడిచారు. జూపాడుబంగ్లా మండలం తరిగోపులకు చెందిన ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నగదు తీసుకునేందుకు ఈరోజు వెళ్లారు. క్యూలో నిలబడ్డ ఆయనకు గుండెపోటుతో రావడంతో చనిపోయారు.

  • Loading...

More Telugu News