: బాబును ప్రజలు నమ్మరంటున్న సత్తిబాబు
ఎన్టీఆర్ విధించిన మద్య నిషేధాన్ని ఎత్తివేసి బెల్టు షాపులకు గేట్లు తెరిచిన చంద్రబాబు నాయుడు, తాజాగా బెల్టు షాపులు మూయిస్తానంటూ ప్రకటించడాన్ని ప్రజలు ఎవరూ నమ్మరని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. గాంధీభవన్ లో ఆయన నేడు మీడియాతో మాట్లాడారు. రకరకాల పథకాల పేరుతో బాబు ప్రజలను మభ్యపెడుతున్నారని బొత్స విమర్శించారు. వడ్డీలేని రుణాలు ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని బొత్స ఆరోపించారు. బాబు.. తన పాదయాత్రను'వస్తున్నా.. నాకోసం' అంటే బావుండేదని బొత్స ఎద్దేవా చేశారు.