: పోలీసులను దూషించిన సీపీఎం ఎమ్మెల్యేకు జైలు శిక్ష
పోలీసులను దూషిస్తూ ఉద్రేకపూరిత ప్రసంగం చేసిన కేసులో కేరళ సీపీఎం ఎమ్మెల్యే ఏఎన్ షంసీర్ కు జైలు శిక్ష విధిస్తున్నట్లు కన్నూరు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు నిచ్చింది. తలస్సెరీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న షంసీర్ కు మూడు నెలల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా కూడా విధించింది. తీర్పు వెలువడిన అనంతరం, ఆయన బెయిల్ తీసుకున్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు ఎమ్మెల్యే షంసీర్ పేర్కొన్నారు. కాగా, 2012 జులై 20న షంసీర్ పై పోలీస్ కేసు నమోదైంది.