: ఏపీ ఆర్థిక మంత్రి యనమలతో వైసీపీ ఎమ్మెల్యేల భేటీ
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుతో వారు సమావేశమయ్యారు. సచివాలయంలోని రెండో బ్లాక్‌లో యనమలతో వారు చర్చిస్తున్నారు. అక్కడ పలువురు అధికారులతోనూ మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యేలు సచివాలయ నిర్మాణ పనుల గురించి ఆరా తీశారు. యనమలతో భేటీ అనంతరం వారంతా కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిసేందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వారు సీఎంను కలవనున్నారు. చంద్రబాబుతో తమ నియోజక వర్గాల అభివృద్ధి పనులపై మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.