: హాంకాంగ్ సూపర్ సిరీస్ టోర్నీలో దుమ్ము దులుపుతున్న హైదరాబాదీలు.. సెమీస్‌లోకి ప్రవేశించిన సింధు
హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షెట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులు దుమ్ము దులుపుతున్నారు. వీరిద్దరు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. క్వార్టర్స్‌లో సింగపూర్ క్రీడాకారిణి జియూ లియాంగ్‌తో ఈ రోజు తలపడిన తెలుగుతేజం పీవీ సింధు విజయఢంకా మోగించింది. 21-17, 21-23, 21-18 తేడాతో సింధు విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించింది. హాంకాంగ్ సూపర్ సిరీస్ టోర్నీలో అద్భుతంగా రాణిస్తోన్న మరో హైదరాబాదీ సైనా కూడా క్వార్టర్ ఫైనల్లో విజయ దుందుభి మోగిస్తే పీవీ సింధు, సైనాల మధ్య పోరు జరగనుంది. ఈ రోజు క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ హాంకాంగ్ క్రీడాకారిణి చెవాంగ్ నాన్‌తో తలపడనుంది.