: మరోసారి తండ్రి అయిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్
టీమిండియా మాజీ క్రికెటర్, కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ మరోసారి తండ్రి అయ్యాడు. పండంటి మగ బిడ్డకు అతని భార్య భువనేశ్వరి జన్మనిచ్చింది. ముంబై శాంతాక్రూజ్ లోని సూర్య ఆసుపత్రిలో తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని శ్రీశాంత్ తెలిపాడు. సూర్య ఆసుపత్రి చాలా బాగుందని, ఆసుపత్రిలోని వాతావరణం బాగా నచ్చిందని... అందుకే తన కుమారుడికి సూర్యశ్రీ అనే పేరుపెట్టినట్టు చెప్పాడు. శ్రీశాంత్ దంపతులకు మొదటి సంతానంగా పాప పుట్టిన సంగతి తెలిసిందే.