: క్రైస్తవ సన్యాసినుల గృహంలో చొరబడి గార్డు గొంతు కోసిన ఆగంతుకుడు
ఆఫ్రికాలో సేవలందించి, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుని ప్రశాంత జీవనం గడుపుతున్న క్రైస్తవ సన్యాసినుల వసతి గృహంలో ఆగంతుకుడు చొరబడి మహిళా గార్డును హత్య చేయడం ఫ్రాన్స్ లో కలకలం రేపుతోంది. ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాల్లో విద్య, వైద్య, ఆధ్యాత్మిక రంగాల్లో సేవలందించిన 59 మంది సన్యాసినులు (నన్స్) సామాజిక సేవ నుంచి విశ్రాంతి (రిటైర్మెంట్) తీసుకుని ప్రశాంత జీవనం గడుపుతున్నారు. గత రాత్రి 10 గంటల సమయంలో ఆ హోంలోకి చొరబడ్డ ఆగంతుకుడు కత్తితో గార్డు గొంతు కోసి హత్య చేశాడు. అయితే దుండగుడు ఆమెను ఎందుకు హత్య చేశాడన్న విషయం అంతుపట్టడం లేదని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి తెలిపారు. దీనిపై క్రైస్తవ క్యాథలిక్ మిషనరీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.