: రద్దైన పాత నోట్లను ఆర్బీఐ కౌంటర్ల వద్ద మార్చుకోవచ్చు
పాత నోట్ల మార్పిడికి సమయం అయిపోయిందన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో చాలా మంది దిగాలు పడిపోయారు. అయితే, ఆర్బీఐ కొంత ఊరటను ఇచ్చింది. రూ. 500, రూ. 1000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌంటర్ల వద్ద మార్చుకోవచ్చని తెలిపింది. అయితే, ఈ సదుపాయం ఇతర బ్యాంకుల కౌంటర్ల వద్ద ఉండదని స్పష్టం చేసింది. మరోవైపు, రూ. 500 నోట్లతో డిసెంబర్ 15 దాకా కొన్ని చెల్లింపులను చేసుకునే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే.