: ఈ తరానికి ఇదే రికార్డు... పెళ్లి ఖర్చు కేవలం 500 రూపాయలు!


తరతరాలుగా వివాహ సంప్రదాయాలు మారుతూ వస్తున్నాయి. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కన్యాశుల్కం నుంచి వరకట్నం వరకు ఎన్నో రకాల పెళ్లిళ్లు జరిగినా... ఈ తరానికి మాత్రం ఒక వివాహం రికార్డు నెలకొల్పింది. సాధారణంగా వివాహం జరుగుతోందంటే గానాబజానాలు, విందు వినోదాలు ఇలా ఖర్చు లెక్కకుమిక్కిలి అవుతుంది. దీంతో ఇల్లు కట్టడాన్ని పెళ్లి చేయడంతో పెద్దలు పోల్చారు. అలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో గుజరాత్ లో ఓ జంట వివాహం సందర్భంగా అతిథిమర్యాదలకు కేవలం 500 రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం విశేషం. గుజరాత్ లోని సూరత్‌ కు చెందిన భరత్‌ పర్మార్‌, దక్షల వివాహాన్ని ఘనంగా చేయాలని పెద్దలు నిర్ణయించారు. నవంబర్ 24 ముహూర్తం కూడా నిర్ణయించారు. ఇంతలో ప్రధాని పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు ఏటీఎంలు పనిచేయడం లేదు. గంటల తరబడి క్యూలలో నిల్చుంటే కానీ డబ్బులు కళ్లజూడలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వివాహం చేసుకునేందుకు ఆడంబరాలు అవసరం లేదని నిర్ణయించుకున్న భరత్, దక్షలు ముహూర్తం సమయానికి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వివాహానికి వచ్చిన అతిథులకు తేనీరు, మంచినీళ్లు ఇచ్చి వివాహం జరుపుకున్నారు. వివాహానికి వచ్చిన బందు మిత్రులు కూడా వారి ఇబ్బందులు గుర్తించి, ఛాయ్ తాగి, వారిని ఆశీర్వదించారు.

  • Loading...

More Telugu News