: మందుబాబులకు కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ గుడ్ న్యూస్!


ఎంత కాదన్నా... మందుబాబులంటే సొసైటీకి కొంత చిన్న చూపే. మొహం మీద కాకున్నా... వెనక మాత్రం తాగుబోతు వెధవ అనుకుంటారు. ఇక ఇంట్లో పెళ్లాం సూటిపోటి మాటల గురించైతే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలాంటి వాటితో విసిగిపోయిన మందుబాబులకు ప్రపంచ ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ మాంచి కిక్కిచ్చే కబురు అందించింది. ప్రతి రోజూ కొంచెం మోతాదులో మందు తీసుకోండి... ఆరోగ్యంగా ఉండండి అని చెప్పింది. సుమారు 20 వేల మందిపై అధ్యయనం జరిపి... పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. కొద్ది మోతాదులో తీసుకునే ఆల్కహాల్ వల్ల అన్ని రకాల స్ట్రోక్స్ తో పాటు గుండెపోటు కూడా దరిదాపులకు రాదని పరిశోధనలో తేలింది. రోజుకు మూడు యూనిట్ల ఆల్కహాల్ ను తీసుకోవడం వల్ల ఇస్కెమిక్ స్ట్రోక్స్ రావడం తగ్గుతుందని పరిశోధకులు తేల్చారు. కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డకట్టుకుపోవడం వల్ల రక్త సరఫరా ఆగిపోతుంది. దీంతో, ఇస్కెమిక్ స్ట్రోక్స్ వస్తాయి. అయితే, అధికమొత్తంలో ఆల్కహాల్ సేవించే వారికి మాత్రం అన్ని రకాల స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తమ పరిశోధనల ద్వారా 85 శాతం మందిలో మంచి ఫలితాలను గుర్తించామని కేంబ్రిడ్జ్ పరిశోధకులు తెలిపారు.

  • Loading...

More Telugu News