: నేడు హైదరాబాదు రానున్న ప్రధాని మోదీ


ప్రధాని నరేంద్ర మోదీ నేటి సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాదు చేరుకోనున్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాని సాయంత్రం ఆరు గంటలకు శంషాబాద్‌ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆయన వెంట పలువురు కేంద్రమంత్రులు, అధికారులు కూడా ఈ ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు వస్తున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాత్రం నేటి మధ్యాహ్నం హైదరాబాదు చేరుకోనున్నారు. ఎయిర్ పోర్టు నుంచి ప్రధాన రోడ్డుమార్గంలో కిషన్‌ గూడ, కామంచెర్వు, మధురా నగర్‌, ఆర్బీనగర్‌, కొత్వాల్‌ గూడ చౌరస్తా, భారత చౌరస్తా, సాతం రాయి, గగన్‌ పహాడ్‌, ఓల్డ్‌ కర్నూల్‌ చౌరస్తా గుండా శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీకి చేరుకోనున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం జరగనున్న జాతీయ డీజీపీల సమావేశంలో పాల్గొననున్నారు.

  • Loading...

More Telugu News