: అమ్మ లేని లోటు తలచుకుంటే ఇప్పుడు ఏడుపొస్తోంది: ‘ధోనీ’ నటుడు


తన తల్లి లేని లోటును తలచుకుంటుంటే ఇప్పుడు ఏడుపొస్తోందని ‘ధోనీ’ నటుడు, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆవేదన వ్యక్తం చేశాడు. తల్లితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఒక ఇంటర్వ్యూలో సుశాంత్ మాట్లాడుతూ, అమ్మ ఇప్పుడు లేదన్న బాధ తీరేది కాదని, ఆమె ఇప్పుడు ఉండి ఉంటే తన విజయాన్ని చూసి గర్వించేదని అన్నాడు. తన తల్లి చనిపోయినప్పుడు కనీసం తాను ఏడవ లేదని, అమ్మ కోసం నాడు ఏడవలేదన్న విషయం గుర్తుకు వస్తే తట్టుకోలేకపోతున్నానని అన్నాడు. నాటి రోజులను మళ్లీ గుర్తు చేసుకోలేనని, ఎందుకో తెలియదు కానీ, నాడు తనను ఉత్సాహపరిచినవి నేడు అంతగా నచ్చడం లేదని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News