: యువీ పెళ్లి శుభలేఖ కార్డుపై రాసిన ప్రధాని పేరులో అక్షరదోషం!
ఈ నెల 30వ తేదీన టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ వివాహం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీకి తన పెళ్లి పత్రికను అందజేయడానికి తల్లి షబ్నం సింగ్ తో కలిసి యువరాజ్ సింగ్ ఈరోజు పార్లమెంట్ కు వెళ్లడం, ఆయనను ఆహ్వానించడం విదితమే. అయితే, యువీ పెళ్లి శుభలేఖ కవర్ పై రాసిన ప్రధాని నరేంద్ర మోదీ పేరులో అక్షర దోషం ఉంది. నరేంద్ర మోదీకి బదులుగా నరేందర్ మోదీ అని ఉండటాన్ని విలేకరులు గమనించారు. వెంటనే తమ కెమెరాలతో ఆ కార్డును క్లిక్ మనిపించారు.