: బీబీసీ జాబితాలో సన్నీలియోన్ తో పాటు మరో నలుగురు భారతీయ మహిళలు!
యూకే మీడియా దిగ్గజం బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) తాజాగా విడుదల చేసిన ‘100 మంది అత్యంత ప్రభావిత మహిళల’ లిస్టులో మనదేశానికి చెందిన ఐదుగురు మహిళలు నిలిచారు. అందులో బాలీవుడ్ అందాల తార సన్నీలియోన్ తో పాటు పలు రంగాల్లో కృషి చేసి గొప్ప గుర్తింపు తెచ్చుకున్న మరో నలుగురు ఉన్నారు. చెన్నైకు చెందిన టీఏఎఫ్‌ఈ సీఈవో మల్లికా శ్రీనివాసన్(57) , మహారాష్ట్రకు చెందిన కంప్యూటర్ ఇంజినీరు గౌరీ చిందర్కర్(20), నటి, రచయిత నేహా సింగ్(34), 80 సంవత్సరాల్లో 8,000 మొక్కలు నాటి, వాటిని సంరక్షించిన కర్ణాటక వాసి తిమ్మక్క(105) నిలిచారు. బీబీసీ ఈ జాబితాను రూపొందించడానికి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార, సాంకేతిక, క్రీడా, ఫ్యాషన్ తో పాటు పలు రంగాలకు చెందిన మహిళలను ఎంపిక చేసుకుంది.