: రెండు లారీలు ఢీ.. డ్రైవర్, క్లీనర్ సజీవదహనం


రెండు లారీలు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు సజీవదహనమైన విషాద సంఘటన ఈరోజు చిత్తూరు జిల్లాలో జరిగింది. చంద్రగిరి సమీపంలోని పూతలపట్టు- నాయుడుపేట జాతీయరహదారిపై కూల్ డ్రింక్స్ లోడుతో వెళ్తున్న లారీ, ఐరన్ లోడ్ లారీ ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నాయి. దీంతో, మంటలు చెలరేగడంతో రెండు లారీలు దగ్ధమయ్యాయి. ఒక లారీలోని డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాద సంఘటనతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News