: కాశ్మీర్ మళ్లీ భూలోక స్వర్గంగా మారుతుంది: ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్
కాశ్మీర్ మళ్లీ భూలోక స్వర్గంగా మారుతుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిత్య సంఘర్షణలతో సతమతం అవుతున్న కాశ్మీర్ వాసుల్లో విశ్వాసం నింపేందుకు అందరూ కలిసిరావాలని ఆయన పిలుపు నిచ్చారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం కాశ్మీర్ లో అల్లర్లను నియంత్రించేందుకు ఉపయోగపడిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ లో పాఠశాలల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టామని, కాశ్మీర్ యుత నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను కూడా ప్రారంభించామని చెప్పారు. కాశ్మీరు ప్రజల్లో విశ్వాసం పాదుగొలపడానికి మనందరమూ కృషి చేయాలని, మంచి సమాజం నిర్మించేందుకు అందరం పాటు పడాలని తాను ఇచ్చిన పిలుపునకు అపూర్వమైన స్పందన వచ్చిందన్నారు.