: మోదీజీ! నా పెళ్లి ఆ విధంగా ఆపినందుకు ధన్యవాదాలు: ఢిల్లీకి చెందిన వధువు కవిత


ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీకి చెందిన కవిత అనే యువతి ధన్యవాదాలు తెలిపింది. కారణమేంటంటే... లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న కవితకి ఎనిమిది నెలల క్రితం ఎమ్‌ఎన్సీలో పనిచేస్తున్న వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ముహూర్తాలు కూడా నిర్ణయించారు. వీరి వివాహం డిసెంబర్‌ 9న జరగాల్సి ఉంది. ఇంతలో ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కవిత తండ్రి వరుడికి ఇస్తామన్న కట్నం పాత నోట్లలోనే అందజేసే ప్రయత్నం చేశారు. అయితే తమకు పాత నోట్లు వద్దని, కొత్త నోట్లు కట్నంగా ఇవ్వాలని వరుడి కుటుంబం కోరింది. తనకు కొంత సమయం కావాలని, వివాహం తరువాత నగదు సర్దుబాటు చేస్తానని కవిత తండ్రి వియ్యంకుల కుటుంబాన్ని కోరారు. దీనికి ఇష్టపడని వరుడి కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించలేదు. దీంతో తన కంటే డబ్బే ముఖ్యమని వారు భావిస్తున్నారన్న విషయాన్ని గుర్తించిన కవిత, అదే విషయాన్ని తెలుపుతూ మోదీ తనకు ఈ విధంగా మంచిపని చేశారని పేర్కొంటోంది. దీంతో ప్రధానికి ధన్యవాదాలు తెలిపింది.

  • Loading...

More Telugu News