: ఆయా చోట్ల రద్దయిన నోట్ల వినియోగానికి ఈ రోజే తుదిగడువు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా సూచించినట్లు రద్దయిన పెద్దనోట్లను ఆయా చోట్ల ఉపయోగించడానికి ఈరోజు తుది గడువు. రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను కొన్ని చోట్ల వినియోగానికి ప్రభుత్వం విధించిన గడువు ఈరోజు అర్ధరాత్రితో ముగియనుంది. ప్రభుత్వాసుపత్రులు, బస్సులు, మెట్రో, రైల్వే, ఎయిర్ లైన్స్ లో టికెట్లు, కరెంట్, వాటర్ బిల్స్, పెట్రోల్ బంకులు, వైద్యుల సలహాతో తీసుకునే మందులు, రైల్వే కేటరింగ్స్, ప్రభుత్వ సంస్థలు విక్రయించే విత్తన విక్రయ కేంద్రాలు తదితర చోట్ల రూ.500, రూ.1000 నోట్లు ఈరోజు అర్ధరాత్రి వరకు తీసుకుంటారు. కాగా, బ్యాంకుల్లో పెద్దనోట్ల మార్పిడి, డిపాజిట్ చేసుకోవడానికి వచ్చేనెల 30వ తేదీ తుది గడువుగా ఉంది.