: ‘పిచ్చోళ్ల స్వర్గంలో విహరించడం మానుకోవాలి’.. ప్రధాని మోదీపై శత్రుఘ్నసిన్హా ఘాటు వ్యాఖ్యలు
పెద్దనోట్ల రద్దుపై బీజేపీ నాయకులంతా ఓ రకంగా స్పందిస్తోంటే, ఆ పార్టీకే చెందిన అసమ్మతి ఎంపీ, బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా మాత్రం మరో రకంగా స్పందించారు. ప్రధాని మోదీ భ్రమల్లో ఉండకూడదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన విమర్శలు గుప్పించారు. పిచ్చోళ్ల స్వర్గంలో విహరించడం మానుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. సొంత ప్రయోజనాల కోసం నిర్వహించిన సర్వేలకు దూరంగా ఉండాలని వ్యాఖ్యలు చేశారు. మోదీ ఆప్‌లో పది ప్రశ్నలు ఇస్తూ పెద్ద నోట్ల అంశంపై నిర్వహించిన సర్వేలో 93 శాతం మంది ప్రజలు మద్దతిచ్చారని మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సర్వేపై ప్రతిపక్షాలు పలు ఆరోపణలు గుప్పిస్తూ మండిపడుతున్నాయి.