: ఒక డాలర్ రూ. 68.83... ఆల్ టైం రికార్డు కనిష్ఠానికి దగ్గరైన రూపాయి


డాలర్ తో రూపాయి మారకపు విలువ మరింతగా పతనమైంది. గురువారం నాటి ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 27 పైసలు పడిపోయి తొమ్మిది నెలల కనిష్ఠస్థాయిలో రూ. 68.83కు దిగజారింది. విదేశీ నిధులు దేశం దాటి వెళుతుండటమే రూపాయిపై ఒత్తిడి చూపుతోందని నిపుణులు వ్యాఖ్యానించారు. నెల చివర కావడంతో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ అధికంగా ఉందని, స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐల లాభాల స్వీకరణ, ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం తరువాత డాలర్ బుల్ రన్ తదితరాలతో రూపాయి విలువ తగ్గుతోందని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ. 68.91ని తాకి సరికొత్త కనిష్ఠాన్ని నమోదు చేసిన తరువాత, ఆ స్థాయికి దగ్గర కావడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News