: ఓ కోతి పెట్టిన గొడవ... ఫిరంగులు, మోర్టార్లతో యుద్ధం, 20 మంది మృతి


ఓ వ్యక్తి పెంచుకుంటున్న కోతి, ఓ బాలిక చేతిని కొరికి ఆమె స్కార్ఫ్ ను లాక్కెళ్లిన ఘటన రెండు తెగల మధ్య యుద్ధానికి కారణంకాగా, హోవిట్జర్ ఫిరంగులు, మోర్టార్లు, యుద్ధ ట్యాంకులతో జరుగుతున్న యుద్ధంలో 20 మందికి పైగా మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన లిబియాలోని సాభా నగరంలో జరిగింది. కోతులను పెంచుకునే వ్యక్తి ఉసిగొల్పడంతోనే తమ అమ్మాయి గాయపడిందని ఓ గిరిజన తెగ ఆరోపించడం, వారికి వ్యతిరేకంగా కోతి యజమానికి అతని తెగ మద్దతు పలకడంతో పరువు యుద్ధం మొదలైంది. ఎవరికి ఎవరూ తగ్గకపోడం, రెండు వర్గాల మధ్యా మారణాయుధాలు పెద్దఎత్తున ఉండటంతో ఈ 'కోతి యుద్ధం' జరుగుతోంది. కాగా, ఇంతటి రభసకు కారణమైన కోతి తీవ్రగాయాలతో మరణించినట్టు తెలుస్తోంది. అయినా ప్రజల మధ్య యుద్ధ వాతావరణం సద్దుమణగలేదు.

  • Loading...

More Telugu News