: జ‌మ్ముకశ్మీర్‌లో 200 మంది ఉగ్ర‌వాదులు.. పార్ల‌మెంటుకు తెలిపిన ప్ర‌భుత్వం


జ‌మ్ముక‌శ్మీర్‌లో 200 మంది వ‌ర‌కు ఉగ్ర‌వాదులు చురుగ్గా ఉన్న‌ట్టు ప్ర‌భుత్వం బుధ‌వారం పార్ల‌మెంటుకు తెలిపింది. వీరిలో 105 మంది పాక్ నుంచి చొర‌బ‌డిన‌ట్టు పేర్కొంది. చొర‌బాట్ల‌ను అడ్డుకునేందుకు స‌రిహ‌ద్దుల్లో చొర‌బాట్ల నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్న‌ట్టు పేర్కొంది. హోం మంత్రిత్వ శాఖ స‌హాయ‌మంత్రి హ‌న్స్‌రాజ్ గంగారామ్ ఓ ప్ర‌శ్న‌కు స్పందిస్తూ రాజ్య‌స‌భ‌కు ఇచ్చిన లిఖిత పూర్వ‌క స‌మాధానంలో ఈ వివ‌రాలు పేర్కొన్నారు. పాక్ నుంచి చొర‌బాట్ల‌ను ఆపేందుకు అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వెంబ‌డి అత్యాధునిక‌ చొర‌బాట్ల నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయనున్న‌ట్టు మ‌రో ప్ర‌శ్న‌కు స‌మాధానంగా మంత్రి కిర‌ణ్ రిజుజు స‌భ‌కు తెలిపారు. ఇందులో భాగంగా కాంప్ర‌హెన్సివ్ ఇంటెగ్రేటెడ్ బోర్డ‌ర్ మేనేజ్‌మెంట్ సిస్టం (సీఐబీఎంఎస్‌)ను పైల‌ట్ ప్రాజెక్టు కింద ఇండో-పాక్‌, ఇండో-బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దులో ఏర్పాటు చేసేందుకు ఆమోదం ల‌భించిన‌ట్టు వివ‌రించారు. ఇందుకోసం నిధులు కూడా సిద్ధంగా ఉన్న‌ట్టు మంత్రి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News